Revanth Reddy Challenges CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ఓ సవాల్ విసిరారు. భద్రాచలం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట మాత్రమే తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న చోట ఓట్లు అడగమని, ఈ సవాల్‌కు కేసీఆర్ సిద్ధమా? అని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకూ కట్టలేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గొప్ప చరిత్ర కలిగిన భద్రాచలం.. తన గుర్తింపును బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా కోల్పోయిందని ఆరోపించారు. శ్రీరాముడికి తలంబ్రాలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ రాలేదని దుయ్యబట్టారు. రూ.1000 కోట్లతో శ్రీరాముడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాటిచ్చి, గాలికొదిలేశాడని మండిపడ్డారు. శ్రీరాముడికి మాటిచ్చి మోసం చేసినోడు బాగుపడతాడా? అని ప్రశ్నించారు. గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ మోసం చేశారన్నారు. వరద బాధితులకు ఇస్తామన్న రూ.10వేలు కూడా ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు వద్ద నిర్మించే పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియడం లేదని రైతులు చెబుతున్నారని, ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
Road Accident: రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి బీజేపీపై ధ్వజమెత్తారు. గ్రౌండ్‌లో కాంగ్రెస్ లేదని బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. భద్రాచలంలో కాంగ్రెస్ ప్రాబల్యం ఎంతుందో వచ్చి చూడండని ఛాలెంజ్ చేశారు. బోడి గుండుపై జుట్టు వచ్చేది లేదు.. తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదంటూ ఎద్దేవా చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భద్రాచలాన్ని కుట్రపూరితంగా మూడు ముక్కలు చేశారని.. అలా చేసిన వారిని మూడు మీటర్ల లోతు గోతిలో పాతరేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.
Guinness World Record: లిప్ కిస్ పెట్టుకున్నారు.. వరల్డ్ రికార్డ్ కొట్టారు