Revanth Reddy: భూపాలపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డిపై టమోటా, గుడ్లతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Leaders Attack On Revanth Reddy With Tomato Eggs In Bhupalapally: భూపాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆయనపై దాడి చేశారు. కోడిగుడ్లు, తమోటాలు విసిరారు. ఇవి రేవంత్ రెడ్డికి తగలలేదు కానీ, సభలోకి కొంతమందికి తగిలాయి. బీఆర్ఎస్ కార్యకర్తల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆపకుండా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కాటారం ఎస్సై శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తలకు దెబ్బలు తగలడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డగించి, స్థానిక సినిమా థియేటర్‌లో బంధించారు.
Man Steal Flower Pots : ఖరీదైన ఎస్యూవీ కార్లో వచ్చి.. క్యా ‘కియా’ రే
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ఈ దాడిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కోడిగుడ్లు, తమోటాలు విసరడం కాదని.. దమ్ముంటే సభ వద్దకు రావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి సవాల్ విసిరారు. తాను తలచుకుంటే.. నీ ఇల్లు ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో జిల్లా ఎస్పీపై కూడా రేవంత్ నిప్పులు చెరిగారు. ‘‘గండ్ర నీకు చుట్టం కావొచ్చు, నీ గుడ్డలు ఊడే సమయం ఆసన్నమైంది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? అని ఎస్పీని ప్రశ్నించారు. తమ సభపై ఆవారాగాళ్లు దాడులు చేస్తుంటే.. చూస్తూ ఊరికే ఉంటారా? అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ ఉందని తాము ఒక రోజు వాయిదా వేసుకున్నామని.. కానీ దాడులు జరుగుతుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?