V Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించిన వీహెచ్.. సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Mallu Ravi Condemns Attack On Revanth Reddy: నిన్న రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జరిగిన దాడిని (టమోటా, కోడిగుడ్లతో ఎటాక్) కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఖండించారు. రేవంత్‌పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాళ్లు, గుడ్లు కొట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులు చేశారని ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ సభ పెడితే, అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని అడిగారు.
Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
మీ ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిందిగా కేసీఆర్‌ను వీహెచ్ సూచించారు. తమపై రాళ్లు కొడితే.. ఏపీలో మీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘‘జాతీయ నాయకుడు అవుతానని అంటున్నావు.. ఇదేనా మీ విధానం?’’ అని ప్రశ్నించారు. అందరూ ఇదే ఆలోచన చేస్తే.. ఎవ్వరూ మీటింగ్ పెట్టలేరని పేర్కొన్నారు. దాడులు రిపీట్ అయితే, అందుకు సమాధానం సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై వీహెచ్ మాట్లాడారు. ఈ ఘటన దారుణమని, విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని చెప్పారు.
Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా ఈ ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని అన్నారు. భౌతిక దాడులు చేస్తే మాట్లాడడం మనుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వారి భ్రమ అని చెప్పారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!