Revanth Reddy Questions Bandi Sanjay Etela Rajender On Sand Mafia: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సాండ్, ల్యాండ్‌మైన్, వైన్ వ్యాపారాలు చేస్తూ.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సాక్షాత్తు కేటీఆర్ నియోజవర్గంలోనే ఇసుక మాఫియా సాగుతోందని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనుగుల గ్రామం వద్ద ఎంపీ సంతోష్ తండ్రి బినామీ పేర్లతో ఇసుక క్వారీ నిర్వహిస్తూ, అక్రమంగా దోచుకుంటున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజానిర్ధారణ కమిటీగా ఈ క్వారీని సందర్శించామని.. యథేచ్ఛగా ప్రొక్లైన్స్ వినియోగించి ఇసుక దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Boora Narsaiah Goud: హత్యల్లో తెలంగాణ బీహార్‌ను మించిపోయింది
అధికారులందరూ ఆ దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్నారని.. తాము అడిగినా అందుబాటులోకి అధికారులు రాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. క్వారీ వల్ల బోర్లు ఎండిపోయి రైతులు నిరసన వ్యక్తం చేస్తే.. వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాతో ఉన్న చీకటి అనుబంధంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్వారీ వల్ల బోర్లు ఎండిపోవడంతో పాటు రోడ్లు నాశనం అవుతున్నాయని.. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రత్యక్ష పాత్ర వల్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తా, కేసీఆర్‌పై యుద్ధం ప్రకటిస్తానని చెప్పిన ఈటెల రాజేందర్.. తన నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Bandi Sanjay: బీజేపీ భిక్ష వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు.. బండి సంజయ్ ధ్వజం
బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్‌లో భాగంగానే ఈటెల మౌనంగా ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడి ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల నేషలన్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుందని.. రైతులకు, ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు కేవలం అధికారం మాత్రమే కోరుకుంటున్నారన్నారు. ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడీపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మీద బండి సంజయ్, ఈటెల సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి కూడా ఇసుక క్వారీలే కారణమని రేవంత్ పేర్కొన్నారు.
Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త