ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్ వచ్చాక మనవడికి ఉద్యోగం రాలేదు కానీ.. మందు అలవాటైందని ఓ పెద్దవ్వ చెప్పిందన్నారు. ఎవరిని కదిలించినా ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుందని ఆయన అన్నారు. పేదల భూములు కబ్జాలు చేసి.. ఈ ఎమ్మెల్యే పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుండట అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. అబద్దాల హామీలు ఇచ్చిన కేసీఆర్ పేదలకు చేసిందేం లేదు. వాళ్ల ఆస్తులు పెంచుకున్నారు.. తప్ప.. తెలంగాణకు చేసిందేం లేదు. కేసీఆర్ సీఎం కావాలని, కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉంది.
Also Read : MLC Election 2023: ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
పోడు భూములపై ప్రశ్నించిన గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టిన పరిస్థితి. రోడ్డుపై చిన్నారి కుక్కలు కరిచి చనిపోతే మంత్రి కేటీఆర్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు. పేదోడి కడుపుకోత నీకు తెలుసా కేటీఆర్.. బీఆరెస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? కనీస మానవత్వం లేని మీరు మనుషులా రాక్షసులా? కాంగ్రెస్ ఏం చేసిందంటున్న ఎమ్మెల్యేకు భూపాలపల్లిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలి నాశనమై పోతారు. రాజీవ్ విగ్రాహం సాక్షిగా డ్రామారావుకు సవాల్ విసురుతున్నా.. నీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా?
మీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధమా? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ.
Also Read : Israel Attack: ఇజ్రాయెల్ దాడి.. 10 మంది పాలస్తీనియన్లు మృతి, 80 మందికి పైగా గాయాలు
బహిరంగ చర్చకు డ్రామారావు సిద్ధమా? రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి… ఇందిరమ్మ రాజ్యం రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.