జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం తమదే అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. మాగంటి…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ జేబులో కత్తెర పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు. రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరంకి…
తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని సాధించేందుకు తీసుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం రాజ్యాంగబద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం దుర్మార్గమని ఆయన ఎక్స్ (X)లో పోస్ట్ చేస్తూ విమర్శించారు.
Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు మళ్లీ కేటీఆర్, కేఎస్ఆర్ నేతృత్వంలోనే తెలంగాణను ముందుకు నడిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా?…
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి…
Harish Rao: కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు (అక్టోబర్ 5) పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను వారు పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే స్థానిక ఇన్చార్జ్ మంత్రుల…
తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో.. జూబ్లీహిల్స్ నియోజవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని బతుకమ్మకుంటను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి బతుకమ్మను వదిలి, గంగమ్మకు చీర, సారెను సమర్పిస్తూ పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. బతుకమ్మకుంటకు రూ.7.40 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేసిన హైడ్రా సంస్థకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, “బతుకమ్మకుంట అభివృద్ధికి హనుమంతరావు ఒక జీవితసాధనగా పోరాటం చేశాడు. ఆయన ప్రయత్నాలు గుర్తుంచుకోవాల్సినవి. అందువల్ల బతుకమ్మకుంటకు ఆయన పేరును…