Telangana: సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి పనులకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు జీఓ విడుదలైంది. క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో ఇండోర్ స్టేడియంలో సింథటిక్ కోర్టులు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్‌బాల్ కోర్టులు ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయనున్నారు.
Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్
అలాగే వాకింగ్ ట్రాక్, లైటింగ్, అథ్లెటిక్స్ కోర్ట్ వంటి సదుపాయాలు కూడా అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి 10 కోట్ల నిధులు మంజూరు చేయడంపై తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలకంటి ఆంజనేయులు, కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్‌గా మారిన పోస్ట్!