Movie Tickets Rates : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఎప్పటినుంచో చాలా అనుమానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంకొన్ని సినిమాలకు బెనిఫిట్ షోలు కూడా వేసుకునేలా జీవో ఇచ్చారు. మొన్న…
CM Revanth Reddy : యూసుఫ్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు. మీ కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్లూ మూసుకోలేదు” అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. “ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే మద్రాసే అనుకునే వారు. కానీ, నేడు తెలుగు సినిమా ఆస్కార్…
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి డివిజన్ వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్‌నగర్ డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్ బాధ్యతలు సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళ్ రావునగర్ డివిజన్లో…
MP Arvind Slams Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఎంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు.
KTR: శంషాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్…
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. “ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా కాంగ్రెస్ పరిస్థితి,” అని ఆయన ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “మొన్న కొండా సురేఖ కుమారుడు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా… క్యాబినెట్లోనే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల గురించి…
KTR: తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే..…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది.
Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
Telangana Govt: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.