Bhatti Vikramarka : హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యసభలో బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. “తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం…
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
TG Cabinet : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు జరిగిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది.. మరో 15 లక్షల మెట్రిక్…
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్లాలని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న అని పేర్కొన్నారు. సీఎం, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొండా మురళి స్పష్టం…
జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ కోసం బుధవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణకు రాగా.. ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విధుల నుంచి తొలగించబడిన సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని పోలీసులు చెప్పగా.. మీరు నిజంగా పోలీసులు కాదేమో అంటూ మంత్రి కుమార్తె సుశ్మిత వాగ్వాదంకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి…
CM Revanth: వరంగల్ జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 15) సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒకటి గంటకు హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకోనున్నారు. అనంతరం ఆయన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమం వడ్డేపల్లి PGR గార్డెన్ లో జరగనుండగా, సీఎం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు ఈ కార్యక్రమంలో…
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని గురుకులాలపై కొనసాగుతున్న సమస్యలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలాగా మారాయని, కేటాయించిన నిధులు సిబ్బంది వేతనాలు, వసతి గృహాల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం సరైన విధంగా ఉపయోగించబడలేదని అన్నారు.
సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్య. ముఖ్యంగా సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలు మారాలన్నా అందరితో సమానంగా అవకాశాలు దక్కించుకోని వృద్ధిలోకి రావాలన్నా ఆయా వర్గాలను విద్యా వంతులను చేయడమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు విశ్వసించడమే కాదు అందుకోసం ఎంతో కృషి చేశారు. ఆ మహానీయుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లను పెంచడం, ఎస్సీ వర్గీకరణ వంటి విధాన నిర్ణయాలకే…
Ministers : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 కి గంటలకు వీరిద్దరూ హెలికాప్టర్ లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని, తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహా జాతర పనుల పురోగతిపై సీతక్క తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి. ఈ సమీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మీటింగ్ తర్వాత…