Sri SathyaSai Dist: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు. ఈ వేడుకలకు హిల్ వ్యూ స్టేడియం ముస్తాబైంది. దీంతో పాటు పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.అయితే, స్టేడియంలో స్వర్ణ రథంపై సత్యసాయి చిత్ర పటాన్ని ఊరేగింపును సత్యాసాయి ట్రస్ట్ నిర్వహించనుంది.
Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి
ఇక, సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలలో పాల్గొని భారీ కేకును కట్ చేసి వేడుకలను జరుపుకోనున్న భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు. కాగా, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో సత్యసాయి విద్యార్థులు అలరించనున్నారు.