KTR: శంషాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్…
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. “ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా కాంగ్రెస్ పరిస్థితి,” అని ఆయన ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “మొన్న కొండా సురేఖ కుమారుడు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా… క్యాబినెట్లోనే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల గురించి…
KTR: తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే..…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది.
Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
Telangana Govt: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kurnool Bus Fire : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూల్ ఘటనలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందజేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. Ananya…
KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,”…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. “గాలి మాటలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న ఉద్యోగుల…