Harish Rao : స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు..!
- పురుగులన్నం ఘటనపై హరీష్ రావు ఆగ్రహం
- సమీక్షలు చేస్తానన్న మాటలు ఎక్కడ.?
- బడిపిల్లలను రోడ్లెక్కించే పరిస్థితులు ఎందుకు వచ్చాయి?
- అసిఫాబాద్ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం అందించిన ఘటనను గుర్తుచేస్తూ, “ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండి” అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నిసార్లు సమీక్షలు జరిపారో, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న వారిపై ఇప్పటిదాకా ఎన్ని చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని అన్న మాటలు ఎక్కడికి పోయాయి? మీ మాటలకు విలువ లేదు, ఆచరణలో దిక్కులేదు” అని హరీష్ రావు విమర్శించారు.
Also Read
పాఠశాలల్లో ఆహార నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులే రోడ్ల మీదకు వచ్చి “పురుగులన్నం మాకు వద్దు” అని నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాంలతోనే నిండిపోయిందని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని హరీష్ రావు ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..