Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి…
Kishan Reddy : నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత మహాహరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతమాత మహారథి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ వర్మకి అలాగే సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఎంఎం కీరవాణి , ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన మాడుగుల నాగఫణి శర్మ, ఈటల రాజేందర్, రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి,…
హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Google Doodle: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్…
Republic Day 2025: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) జరుపుకుంటోంది. ఇందుకోసం ముమ్మరంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే ప్రధాన ఆకర్షణ ఇందులో జరిగే పరేడ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్ లో దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం,…
ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే…
5వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసిద్ధ దేశభక్తి గీతం 'దేశ్ రంగీలా'ను పాడినందుకు ఈజిప్టు అమ్మాయి కరీమాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు. ఇండియా హౌస్‌లో జరిగిన వేడుకలో కరీమాన్ ఈ పాటను అందించారు. ఆమె ప్రదర్శనకు భారతీయులు, ఈజిప్షియన్ల నుంచి ప్రశంసలు లభించాయి.