ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రభుత్వం తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Read Also: ఏపీలో కొత్త…
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో 73వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ నుంచి రాజ్‌భవన్‌కు మార్చారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్ లైన్…
భారత గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. రాజ్ పథ్ పరిసరప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉగ్ర హెచ్చరికలతో భారీగా భద్రత ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఏర్పాట్లు వున్నాయి. ప్రతి సంవత్సరం లక్షమంది పాల్గొనేవారు. ఈసారి 6 వేలమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతాయని సమాచారం వుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.…
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ★ బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు…
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం కూడా ఈ సారి గణతంత్ర వేడుకలపై పడింది. ఏకంగా వేదికనే మార్చే స్థితికి పరిస్థితి వచ్చింది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించేది కానీ రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్న కారణంగా…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే…
ఈనెల 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ సహా ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులపైనా ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ప్రసిద్ధ కట్టడాలు, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి. డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా…