లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకుల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: వెనిజులాపై ఉపయోగించిన సీక్రెట్ వెపన్ పేరు వెల్లడించిన ట్రంప్
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా పక్కనే రాహుల్ గాంధీ నిలబడి పరేడ్‌ను వీక్షించారు. తెల్లటి టీ-షర్ట్ ధరించిన రాహుల్ గాంధీ కవాతును నిశితంగా గమనిస్తూ కనిపించారు. ఇక ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వెండెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో డికోస్టా హాజరయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, విఐపీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక కవాతులో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే 30 శకటాలు. 13 మంత్రిత్వ శాఖలు ప్రదర్శించబడ్డాయి. పాత్ ఆఫ్ డ్యూటీలోని సందర్శకుల గ్యాలరీలకు గంగా, యమునా, కృష్ణ, నర్మద, పెరియార్ వంటి భారతదేశ నదుల పేర్లు పెట్టారు. ఆపరేషన్ సిందూర్‌లో తన పరాక్రమాన్ని ప్రదర్శించిన రాఫెల్‌ను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ప్రదర్శించారు. గంటకు 900 కి.మీ వేగంతో ప్రయాణించి చార్లీ ఫార్మేషన్‌ను రూపొందించింది.