75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపింది.
ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30గంటల ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం సాయంత్రం జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు జంతర్ మంతర్ వద్ద ప్రధానమంత్రి మోడీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనం చేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక జంతర్‌మంతర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
రేపు ఏపీ సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అందుకోసం.. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి సీఎం పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కెనడాను భారత్ హెచ్చరించింది. కెనడా తమ దౌత్య సముదాయాలకు భద్రత కల్పించాలని భారత్ కోరింది.
Telangana Shakatam: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు సమాయత్తమవుతున్నాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (గురువారం) భారత్‌కు రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోనున్నారు.
దాదాపు మూడు సంవత్సరాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణా శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015, 2020 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరమే తెలంగాణా శకటానికి అవకాశం దక్కింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేళ్ల పాటు కూడా తెలంగాణా శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణాలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. దీనిలో భాగంగా కొమరం…
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో గల కర్తవ్యపథ్‌లో మొదటి సారిగా పరేడ్‌ను నిర్వహించారు.