Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి దూకడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంటలను సహాయక బృందాలు వెంటనే అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Best 5G smartphones: రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
భారత మాతకు మహా హారతి కార్యక్రమం ముగింపునకు దగ్గర్లో ఉండగానే ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, బీజేపీ నేతలు, ప్రముఖ సినీ దర్శకుడు ఎంఎం కీరవాణి, నాగఫణి శర్మ తదితరులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకలను ఆనందించారు. కిషన్ రెడ్డితో పాటు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ భారత మాతకు మహా హారతి కార్యక్రమానికి మానసిక ఉత్సాహాన్ని పంచారు.
Yogi Adityanath: ‘‘సనాతన ధర్మం జాతీయ మతం’’..సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..