Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని బీచ్ రోడ్‌లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్‌గా పోలీసులు గుర్తించారు. ఉదయం 7.30 గంటలకు జరిగిన సమయంలో షూటింగ్‌లో పాల్గొన్న లగ్జరీ కార్లలో ఒకదానిని అతడు ఢీకొట్టారు. దీంతో వెంటనే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీస్కుంటూ అతను మరణించారు. అయితే, మార్గమధ్యంలో నిలబడి మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తుండగా రెండు కార్లలో ఒకటి సదరు ఆల్విన్‌ని ఢీకొట్టింది.
Read Also: Pushpa 2 : పుష్పరాజ్ విధ్వంసం.. రూ.1000కోట్లతో హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
అయితే, వెల్లయిల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యూఏఈ నుంచి తిరిగి వచ్చిన ఆల్విన్ ప్రమాద సమయంలో నెల్లికోడ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కార్ డీలర్‌షిప్ కోసం ప్రమోషనల్ వీడియోను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా నియంత్రణ కోల్పోయి.. ఆల్విన్‌ను ఢీకొట్టి చాలా దూరం తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఈ సంఘటన జరిగినప్పుడు అతను స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
Read Also: Akhanda 2 : అఖండ 2 నుంచి సాలీడ్ అప్ డేట్.. ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
కాగా, ఆల్విన్ అతని తల్లిదండ్రులకు ఏకైక సంతానం. యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోజికోడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో పాల్గొన్న రెండు వాహనాలు ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్-బెంజ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ రెండు వాహనాలను షూట్ కోసం కార్ డీలర్‌షిప్ నుంచి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.