సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం యువకుల తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, వ్యూస్ కోసం ఏకంగా ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోవాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. కష్టపడి చేసిన వీడియోకు అనుకున్న స్థాయిలో లైకులు, వ్యూస్ రాకపోతే వారికి చాలా బాధగా ఉంటుంది. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. కొందరు మాత్రం చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది.
CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా..
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్‌పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ప్రమాదానికి పాల్పడ్డ బస్సును పట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనకు ముందు ముగ్గురు యువకులు మార్గమధ్యంలో ఓ యువకుడిని ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు. రోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చితాయ్‌పూర్ ఖానావ్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులు అఖారి గ్రామానికి చెందిన సాహిల్ రాజ్‌భర్(16), చంద్రశేఖర్రాజ్‌భర్(16), శివమ్ రాజ్‌భర్(16)గా గుర్తించారు. ఈ యువకులు కేటీఎం బైక్ పై బచావ్ బజార్‌కు వెళ్లినట్లు తెలిపారు. బచావ్ మార్కెట్ నుండి అక్రి వైపు తిరిగి వస్తూ.. బైక్‌ను ఊపుతూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న బస్సును యువకుల బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్, సాహిల్ అక్కడికక్కడే మృతి చెందారు. శివమ్‌ను ట్రామా సెంటర్‌కు తరలిస్తుండగా.. చనిపోయాడు. ముగ్గురూ అఖారి గ్రామానికి చెందిన యువకులు.