Meta Edits App: ప్రస్తుతం షార్ట్ వీడియోల ట్రెండ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదనడంలో యువతి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో ఈ వీడియోలు ఎక్కువగా చూసే హవా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాపులారిటీని మెటా ఈ రంగంలో మరింత ప్రభావాన్ని చూపేందుకు ముందుకు వచ్చింది. ‘ఎడిట్స్’ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను పరిచయం చేసి, బైట్‌డాన్స్ కంపెనీకి చెందిన క్యాప్ కట్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ యాప్ సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ప్రకారం.. ‘ఎడిట్స్’ కేవలం మరో వీడియో ఎడిటింగ్ యాప్ మాత్రమే కాదు. ఇది క్రియేటర్ల కోసం ఒక పూర్తి క్రియేటివ్ సూట్ లాంటిదని తెలిపారు. ఈ యాప్‌లో ఉన్న ఫీచర్లు నిజంగా ఆకట్టుకునేలా ఉండనున్నాయి.
Also Read: Sankranthiki Vasthunnam : ఆల్ టైమ్ రికార్డు దిశగా సంక్రాంతికి వస్తున్నాం
‘ఎడిట్స్’ యాప్‌లో అదిరిపోయే ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో క్రియేటర్లు ఐడియాలను సేవ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్ ఉండనుంది. మంచి క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేసుకునే కెమెరా సెట్టింగ్స్ అందుబాటులో ఉంటాయి. వీడియోలను మరింత అందంగా మార్చేందుకు ఉచితంగా అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. క్రియేటర్లు, ఫ్రెండ్స్ తమ డ్రాఫ్ట్‌లను ఒకదానితో మరొకటి షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలు ఎలా ప్లే అవుతున్నాయో తెలుసుకొనేందుకు పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ టూల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను ఎడిట్ చేస్తే వాటర్ మార్క్స్ పడతాయి. కానీ ‘ఎడిట్స్’ యాప్‌లో వాటర్‌మార్క్ లను లేకుండా వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ షార్ట్స్ వంటి వేర్వేరు ఫ్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు పెట్టే క్రియేటర్లకు మంచి అవకాశంగా భావించవచ్చు.
Also Read: Elon Musk: ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఎలాన్ మస్క్ అత్యుత్సాహం.. వివాదానికి దారితీసిన ‘నాజీ సెల్యూట్’
ప్రస్తుతం ‘ఎడిట్స్’ యాప్ ఐఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్ చేయడానికి యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఈ యాప్ వస్తుంది. ఈ యాప్ పూర్తిగా ఉచితం. అలాగే స్మార్ట్‌ఫోన్లలో వీడియోలను ఎడిట్ చేయడానికి బాగా అనువుగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఇక ‘ఎడిట్స్’ యాప్‌లోని ముఖ్య ఫీచర్లలను ఒకసారి చూస్తే.. ఇందులో 2K రిజల్యూషన్, 60fpsతో HDR, SDR ఫార్మాట్లలో వీడియోలు చేయవచ్చు. అలాగే ప్రొఫెషనల్ వీడియోల కోసం ఆడియో, ఫిల్టర్స్‌ను లేయర్లుగా కూడా యాడ్ చేయవచ్చు. ఇక ఈ ‘ఎడిట్స్’ యాప్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మొదట iOS యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. ప్రస్తుతం, యాప్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.