ప్రస్తుతం యువతలో పెరుగుతున్న రీల్ క్రేజ్ వారికి ప్రమాదంగా మారుతోంది. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి, ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. రీల్స్ కోసం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న అనేక ఉదంతాలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్లో ఇద్దరు యువకులు హైవేపై రీల్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ప్రమాదవశాత్తు వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో.. యువకులు కొన్ని సెకన్ల పాటు గాల్లోనే ఉండి కిందపడ్డారు. సినిమాలో జరిగే సన్నివేశంలా అనిపించింది. కాగా.. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Old City Murder Case : రౌడీషీటర్ రియాజ్ హత్య కేసు ఛేదించిన బాలాపూర్ పోలీసులు
వెంటనే.. అక్కడున్న స్థానికులు గమనించి వారిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా.. కొత్వాలి సిటీ బిజ్నోర్ నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై హెల్మెట్ ధరించకుండా యువకులు అజాగ్రత్తగా బైక్ నడుపుతున్నారు. అయితే.. అకస్మాత్తుగా వేగంగా వచ్చిన కారు యువకుల బైక్ ను ఢీకొట్టింది. అయితే.. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట