దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సుదీర్ఘ అనుభవం కలిగిన కాంగ్రెస్ అయితే ఘోరంగా చతికిలపడింది.
విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు.
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే అల్లు అర్జున్ స్పందించారని అన్నారు.
తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీలో 14 రంగాలు పెట్టుబడి తీసుకొచ్చేవిగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ వాళ్లకు రేస్ కోసం అడిగాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చాలనుకున్నామని తెలిపారు. వాళ్లు రాలేమని అన్నారు, ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న (శుక్రవారం) మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో అతని కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు నలుగురయ్యారు. రోహిత్, రితిక దంపతులకు 2018లో సమైరా అనే కూతురు జన్మించింది. కాగా.. కొడుకు పుట్టడంపై రోహిత్ శర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ…
సినిమా వాళ్ల ఎపిసోడ్ లో కొంత సంయమనం పాటించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అని అడిగారు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా... సినిమా వాళ్ళు చర్చను కొనసాగించారన్నారు.
రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. వినేష్‌కి కచ్చితంగా అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను.. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో…
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.