బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ కమిషనర్, జీఎచ్ఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేలు, ప్రోటోకాల్ అధికారులతో చర్చలు జరిపారు.
Read Also: Rs 200 and Rs 500 Notes: రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులకు తెలిపారు. పోలీస్ శాఖ రేపటిలోగా ఈ సంఘటన పై నివేదిక సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత అవార్డు..
కాగా.. ఉదయం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మేయర్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే.. కోపంతో ఆలయం బయటే కూర్చొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. సరైన భద్రత కల్పించడం లేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.