విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు. ఆయనతో ఇంకా మాట్లాడలేదు.. వైసీపీలో విజయసాయి రెడ్డి చాలా కీలక నేత అని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలుకన్నారు.. మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నారని తెలిపారు.
Read Also: Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!
టీడీపీతో పాటు కొందరు ఆయనపై కుట్రలు.. కుతంత్రాలు చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీద కక్ష సాధింపులకు పాల్పడినా.. చలించకుండా ఎదుర్కున్నారని తెలిపారు. నెల్లూరు లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధిస్తారని భావించాం.. దురదృష్టం కొద్ది ఓడిపోయారని అన్నారు. విజయసాయి రెడ్డి విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని స్పందిస్తాం.. ఆయన ఏదైనా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచించి ఉంటే.. కొనసాగాలని కోరుతామని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Read Also: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. కొండెక్కిన ధరలు.. ఎంతంటే..!