సినిమా వాళ్ల ఎపిసోడ్ లో కొంత సంయమనం పాటించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అని అడిగారు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా… సినిమా వాళ్ళు చర్చను కొనసాగించారన్నారు. కొండా సురేఖనీ అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై కూడా సినిమా వాళ్ళు స్పందిస్తే బాగుండేదన్నారు. కొండా సురేఖ పై.. సినిమా హీరోల ట్వీట్స్ పై మంత్రి పొన్నం స్పందించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా.. కూడా అంత దాడి అవసరమా..? అని ప్రశ్నించారు. బలహీన వర్గాల మంత్రి ఒంటరి అనుకోకండి అని హెచ్చరించారు.
READ MORE: Almonds Benefit: బాదంపప్పును ఇలా తింటేనే బెనిఫిట్స్.. లేదంటే దండగే
అసలేంటి ఈ వివాదం..
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉండగా.. దీనిపై మళ్లీ కొండా సురేఖ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని పేర్కొన్నారు.
READ MORE:Heavy Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు 4 రోజుల పాటు భారీ వర్ష సూచన
తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్ లో పేర్కొన్నారు.