విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధిష్టానం స్పందించింది. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. మీ నిర్ణయంతో ఏకీభవించకుండా గౌరవిస్తున్నామని ట్వీట్ చేసింది. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లోనూ, విజయాల్లోనూ తమతో పాటు నిలబడిన మీరు పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరు అని పేర్కొంది. మీరు మీ హార్టికల్చర్‌లో అభిరుచిని కొనసాగించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలనే మీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని వైసీపీ అధిష్టానం తెలిపింది. మీ అభిప్రాయాలు ఎల్లప్పుడూ గౌరవించబడతాయని.. మీ భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నామని ట్వీట్‌లో వెల్లడించింది.
Read Also: Best Electric Cars: దుమ్మురేపే ఫీచర్లతో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఏకంగా 500KM రేంజ్!
కాగా.. విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. విజయసాయి రెడ్డి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులిటెన్ విడుదల చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని విజయసాయి రెడ్డి శుక్రవారం ఎక్స్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు. తాను ఏ రాజకీయపార్టీలోను చేరడంలేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.