దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక సుదీర్ఘ అనుభవం కలిగిన కాంగ్రెస్ అయితే ఘోరంగా చతికిలపడింది. ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జీరో సీట్లు సాధించింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
ఇది కూడా చదవండి: Principal Slaps Teacher: టీచర్‌ను చెంప దెబ్బలతో వాయించేసిన ప్రిన్సిపాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆప్, కాంగ్రెస్ బాధ్యత వహించాలని సూచించారు. మనమంతా ఇండియా కూటమిలో భాగస్వాములం.. కాంగ్రెస్ సీనియర్ భాగస్వామి.. అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉందని హితవు పలికారు. అలాగే ఆప్ కూడా బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసుంటే.. ఫలితాలు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే దీనిపై చర్చ జరగాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ గెలిచేది కాదు అన్నారు. ఇప్పుడు ఓటమికి ఆప్, కాంగ్రెస్ రెండూ కూడా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. అయినా ఇండియా కూటమిలో ఎవరికీ అహం ఉండకూడదన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని సంజయ్ రౌత్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Singapore : పదివేల మంది భక్తులతో కలిసి హిందూ ఆలయంలో ప్రధాని పూజలు
గత శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్‌లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్‌ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి 48, ఆప్‌కి 22 సీట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!