ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మంచి ప్రదర్శనప్పటికీ తన ప్రవర్తనతో విలన్ రోల్ కూడా పోషిస్తున్నాడు.లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి, గంభీర్ గొడవకు మూలకారకుడు సిరాజే అన్న సంగతి అందరికి తెలుసు.. ఆ గొడవ సద్దుమణుగకముందే సిరాజ్ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు.
రాహుల్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. రాహుల్ ఫ్రాంచైజీని విడిచిపెట్టి స్కానింగ్ కోసం ముంబైకి బయలుదేరాడు. క్రిక్‌బజ్ నివేదిక నుంచి ఈ సమాచారం అందింది. ఫీల్డింగ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ చేర్చబడ్డాడని, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో అతను ఉన్నాడు.
మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి, అనంతరం కాళ్లు మొక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్తూ కొట్టుకొనేంత పనిచేశారు. వీరి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరుజట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఐపీఎల్ మ్యాచులకు ఉన్న క్రేజ్ గురించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లను చూస్తున్నారు. ఐపీఎల్ లో ఉన్న టీమ్‌లకు అభిమానులు ఎక్కువ. తాజాగా జరుగుతున్న సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది.
ఐపీఎల్ -16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో 32వ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ మొత్తం హైలెట్ గా నిలిచింది మాత్రం మన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక్కడే. 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్ హిత్ తో పంజాబ్ బ్యాటర్ ను రనౌట్ చేడయం కూడా విశేషం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో చెలరేగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ మాత్రం కష్టాల్లో పడింది.