RCB full list of players retained, released ahead of IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) భారీ ప్రక్షాళనకు దిగింది. ఏకంగా 11 మంది ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ, టీమిండియా పేస్ బౌలర్ హర్షల్ పటేల్, న్యూజీలాండ్ క్రికెటర్ మైఖేల్ బ్రేస్‌వెల్, దక్షిణాఫ్రికా సీనియర్…
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
Jailer team agreed to alter the scene of a killer wearing RCB jersey: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రంకు మంచి టాక్ రావడం, రజనీకాంత్ నట విశ్వరూపం చూపించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్…
RCB confirms appointment of Andy Flower as head coach: ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే మాజీ క్రికెటర్ అండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది. దాంతో ఐపీఎల్ 2023లో హెడ్ కోచ్‌గా పని చేసిన సంజయ్ బంగర్ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు డైరక్టర్ ఆఫ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక మార్పులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలో కీలక సభ్యులై డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ లను వారి పదవుల నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బౌలింగ్ కోచం ఆడమ్ గ్రిఫ్ఫిత్ ను మాత్రం జట్టుతోనే ఉంచుకునేందుకు బెంగళూరు టీమ్ యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్బీసీ 3 సార్లు ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆర్బీబీ ఫ్రాంచైజీ మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ వినిపిస్తుంది.
లక్ష్య ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. పవర్ ప్లేలోని 4.5 ఓవర్లలోనే ఆర్సీబీ 50 పరుగుల మార్క్ ను ధాటింది. ఇక పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు స్కోరు 64/0గా ఉంది. విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్నా విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ లు సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక పది ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు…
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో క్లాసెన్ ఒక్కడే అసాధరణమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ కు భారీ టార్గెట్ ను ఇచ్చింది.
రాజస్తాన్ స్పిన్నర్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బాల్స్ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం మహేంద్ర సింగ్ ధోనిని గుర్తుకుతెచ్చింది.
మరోసారి హైవోల్టేజ్ డ్రామాను చూడటానికి వేచి ఉన్నారు. మ్యాచ్ లో ప్రతి అభిమాని చూపు కోహ్లీ-దాదా వైపే చూస్తున్నారు. అదే సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈసారి షేక్ హ్యాండ్ ఇస్తారా లేదో చూడాలని అంతా అనుకున్నారు.