ఐపీఎల్2023 సీజన్ 16లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ ను ఛేదించే దిశగా తమ ప్రయాణాన్ని సాగించలేదు. ఆర్సీబీ బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో 59 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది.
Also Read : Weather Updates : మరో ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు
ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ స్పిన్నర్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బాల్స్ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం మహేంద్ర సింగ్ ధోనిని గుర్తుకుతెచ్చింది.
Also Read : Tomato Face Packs: టొమాటో ఫేస్ మాస్క్‌తో మెరిసే చర్మం మీ సొంతం
ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లాస్ట్ బాల్ ని హెట్‌మైర్ ఆఫ్‌సైడ్ ఆడగా.. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో హెట్‌మైర్ అశ్విన్‌కు సెకండ్ రన్ కోసం కాల్ ఇచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్ కీపర్ అనూజ్ రావత్‌కు త్రో వేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లిన రావత్.. బంతిని అందుకొని వెనుక వైపు నుంచి వికెట్లపైకి విసిరాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే బ్యాక్‌ఎండ్ నుంచి వికెట్లను గిరాటేసి బ్యాటర్‌ను ఔట్ చేశాడు. ఇప్పుడు అచ్చం ధోని స్టైల్‌ను కాపీ కొట్టిన రావత్ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో ఒక బ్యాటర్ డైమండ్ డక్ అవ్వడం ఇది ఏడోసారి.
Anuj Rawat channelling a bit of Dhoni? 🤯
Superb presence of mind from the #RCB gloveman 🤩#IPLonJioCinema #RRvRCB #TATAIPL #IPL2023 pic.twitter.com/WXrBSyhQds
— JioCinema (@JioCinema) May 14, 2023