టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, తెలుగులోనూ ఆదరణ బాగుందని విష్ణు విశాల్ మంగళవారం మీడియాతో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్ల ఓనర్స్, పంపిణీ దారులు ఈ…
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ధమాకా”లో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీలీలని పావని పాత్రలో పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్…
తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన “ఖిలాడీ” సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూవీ విడుదలైన ఒక రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తెలుగు సినిమా నిర్మాతలు తన అనుమతి లేకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ అనే తన సినిమా టైటిల్‌ను ఉపయోగించారని ఆరోపించారు. చిత్రనిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ “మేము సమర్పకుడు, నిర్మాతపై కేసు…
మాస్ మహారాజా రవితేజ వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, పలు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నారు. సుశాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు నటించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సుధీర్ వర్మ…
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ సినిమాల విడుదల తేదీలను రీ షఫిల్ చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకుల చిత్రాల విడుదల తేదీలన్నీ మారిపోయాయి. ఇక ‘గని’ లాంటి సినిమా అయితే రెండు లేదా మూడు వారాల ముందు రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాస్ మహరాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదల విషయంలోనూ నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముందు అనుకున్నట్టు మార్చి 25వ తేదీ…
రవితేజ కథానాయకుడిగా సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ సినిమాను నిర్మించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగులో విషయంలో జాప్యం జరిగింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తుందేమోనని కూడా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లోకి దిగిపోయినట్టు…
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను…
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో చిరంజీవితో ‘అన్నయ్య’ సినిమాలో ఆయన తమ్ముడుగా నటించాడు రవితేజ. ఇక రవితేజ ‘డాన్ శ్రీను’కి స్క్రీన్ ప్లే, ‘బలుపు’కి కథ అందించిన కె.యస్. రవీంద్ర అలియాస్ బాబీ రవితేజ ‘పవర్’ సినిమాతోనే దర్శకుడుగా మారాడు. ఇప్పుడు చిరంజీవితోనూ, దర్శకుడు బాబీతోనూ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో చిరు సన్నిహితుడి పాత్రలో…
దీపావళి పండుగ సందర్భంగా రవితేజ నటించిన తాజా చిత్రం “ఖిలాడీ” నుంచి అప్డేట్స్ ప్రకటించారు. “ఖిలాడీ” మేకర్స్ తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. డిఎస్పీ తన ట్రేడ్‌మార్క్ పెప్పీ స్టైల్లో కంపోజ్ చేసిన “ఖిలాడీ” టైటిల్ సాంగ్ రవితేజ పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. విలాసవంతమైన సెట్లు, విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్ మూవ్‌లు, యశ్వంత్ కొరియోగ్రఫీ ఈ పాటకు…