హీరో రవితేజ పక్కన పెట్టేశాడంటూ ప్రచారంలో ఉన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఎట్టకేలకు ప్రమోషన్ మొదలైంది. శనివారం ఐటమ్ సాంగ్ సీసాను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు శామ్ సి.ఎస్ సంగీతం అందిచారు. రవితేజ, అన్వేషా జైన్ పై చిత్రీకరించిన ఈ పాటను శ్రేయోఘోషల్ పాడారు. ‘ఒకరికి నే తేనె సీసా… ఒకరికి నేను కల్లు సీసా… ఒకరికి నే రసాల సీసా… అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా… ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా……
ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగల్ ‘నాపేరు సీసా’ పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్… సీసా (సీకాకులం సారంగీ) గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాటలో ట్రెడిషనల్ వేర్ లో కనిపించిన రవితేజ సరసన ఉల్లాసంగా ఆడిపాడింది అన్వేషి. థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా వుంది…
మాస్ మహరాజా రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. అయితే మూవీని మరింత చక్కగా జనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జూన్ 17న విడుదల కావాల్సిన దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.…
ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుకోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో వెంకటేష్, మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించి మెప్పించాడు శ్రీకాంత్. ఇక చివరగా…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన ‘చోర్ బజార్’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ మహరాజా రవితేజ. ఈ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే కావడం విశేషం. ఆయన తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్…
‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి.…
హీరోగా రవితేజ, డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇద్దరూ ‘నీ కోసం’ సినిమాతోనే ప్రయాణం మొదలెట్టారు. ఆ పై వారి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. అలా అలరించిన చిత్రాల్లో 15 ఏళ్ళ కిందట జనం ముందు నిలచిన ‘దుబాయ్ శీను’ కూడా చోటు సంపాదించింది. నయనతార నాయికగా నటించిన ‘దుబాయ్ శీను’ 2007 జూన్ 7న విడుదలై వినోదం పంచింది. కథలోకి తొంగి చూస్తే- దుబాయ్ వెళ్ళి కోట్లు సంపాదించేయాలని…
ఫరియా అబ్దుల్లా.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా అవతరించింది. యువతలోనూ విపరీతమైన ఫాలోయింగ్ గడించింది. కాకపోతే.. ఆ క్రేజ్‌కి తగినట్టు ఈమెకు మంచి అవకాశాలైతే రాలేదనే చెప్పుకోవాలి. ‘రావణాసురుడు’ మినహాయిస్తే.. గొప్ప ఆఫర్లేమీ లేవు. అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ భామకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రవితేజ సినిమాలోనే.. అదే ‘ధమాకా’. కాకపోతే హీరోయిన్గా కాదు. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం.. ధమాకాలో ఈ జాతిరత్నం…
డ్రగ్స్ కేసుల్లో ఏం జరుగుతోంది?ఒక్క సెలబ్రిటీకి కూడా శిక్షపడదా?ఆధారాల్లేకుండానే అరెస్టులు, విచారణలు జరుగుతున్నాయా?సెలబ్రిటీలను కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారా? ఓ రేంజ్ లో హడావుడి చేస్తారు..దేశమంతా దాని గురించే చెప్పుకుంటారు.. ఫలానా నటుడు, నటి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని..అని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటాయి.. ఓ పది పదిహేను రోజులు.. గట్టిగా ఓ నెల రోజులు ఈ వ్యవహారం చుట్టే అందరి దృష్టి ఉంటుంది. బెయిల్ ఇచ్చేది లేదంటారు..ప్రశ్నలు, విచారణలు, అబ్బో ఒకటేమిటి…ఇవాళో, రేపో ఏకంగా శిక్ష పడుతుందనే…