మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ‘వాల్తేరు వీరయ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమలో.. మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. అయితే రీసెంట్‌గా ఆచార్య ఎఫెక్ట్ వల్ల.. కాస్ట్ కటింగ్ కోసం రవితేజను తప్పించారని వినిపించింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మెగాస్టార్‌తో రవితేజ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోడం ఖాయమంటున్నారు. ఇక ఈ సినిమాలో మాస్ రాజా ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడనే విషయంలో.. చాలా రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి.
ముందుగా ఇందులో రవితేజ మెగాస్టార్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడని వినిపించింది. ఆ తర్వాత చిరు-రవితేజ అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలిసింది. ఇక ఇప్పుడు మరో రోల్ తెరపైకొచ్చింది. వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా ఓ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనించబోతున్నాడట. అంతేకాదు ఇటీవలె వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన క్రాక్ సినిమాలోని పాత్రకి.. ఇందులో పాత్రకి దగ్గరి పోలికలుంటాయనే ప్రచారం మొదలైంది. గతంలో బాబీ తెరకెక్కించిన పవర్ సినిమాలో రవితేజను పవర్ ఫుల్ కాప్‌గా చూపించాడు. దాంతో బాబీ ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట.. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రవితేజ ఈ మూవీలో ఎలాంటి రోల్ పోషిస్తున్నాడనేది.. ఆసక్తికరంగా మారింది. ఇక పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌లో రవితేజ సీన్స్ చిత్రీకరించబోతున్నారట. ఏదేమైనా రవితేజ.. వాల్తేరు వీరయ్యలో ఎలా కనిపిస్తాడో చూడాలి.