మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఒకేసారి మూడు భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో పాటు ‘ధమాకా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇందులో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు రెండూ షూటింగ్ పూర్తయ్యే దశలో ఉండగా, ఆయన ఇటీవల ప్రకటించిన ‘ధమాకా’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించిన ‘ధమాకా’ టీం తాజాగా హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ పూర్తి…
మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా త్రినాథరావు నక్కిన ప్రాజెక్ట్ అప్డేట్ ను రవితేజ స్వయంగా ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ సినిమాను చేయనున్నాడు. ఈ నెల 4 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు రవితేజ.. రోల్-కెమెరా-యాక్షన్…
రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ…
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ సినిమా టాకీ పూర్తయింది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఖిలాడి’ నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. అంతకు ముందు వినాయక చవితి సందర్భంగా తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ రెండింటికి చక్కటి స్పందన లభిస్తోందని, ఇటీవల షెడ్యూల్ తో రెండు పాటలు మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫోరెన్సిక్ నివేదికలో డ్రగ్స్ వాడనట్లుగా నివేదిక రావడంతో 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లో తోపాటు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. 2017లో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు చేసిన కేసులో చార్జిషీట్ దాఖలు కాగా.. రంగారెడ్డి ఎక్సైజ్ కోర్టులో సిట్ చార్జిషీట్…
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. పూరి జగన్నాథ్ ఆగస్టు 31 ఛార్మి సెప్టెంబర్ 2…
2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకుఈ సినీ స్టార్స్ విచారణను విచారించనున్నారు. ఈ కేసుతో సంబంధం వున్నవారి నుంచి గోర్లు, తల…
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,…