కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని అన్నారు. రెండు తెలుగు రాష్టాలలో అధికారం కోల్పోయినా.. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
CM KCR: మీ ముందే బీఆర్‌ఎస్ పుట్టింది.. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్ పుట్టింది..
తెలంగాణ ఉద్యమానికి ప్రతీకలు కరీంనగర్ ప్రజలు.. అందుకే ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అవకాశాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. 2004 నుండి 2009 వరకు కరీంనగర్ ప్రజలను కేసీఆర్ నమ్మించి మోసం చేసిండని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కామారెడ్డి పోయిండని విమర్శించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే రసమయికి రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. తన దగ్గర గోసి, గొంగడి ఉందని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని దుయ్యబట్టారు.
Priyanka Gandhi: రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ పాటను దొర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన రసమయి బాలకిషన్ అని అన్నారు. మానకొండుర్ ప్రజలు రెండు సార్లు స్థానికేతరునికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఆ సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల కోరిక మేరకు బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపే ఆలోచన చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక దొరల గడీలా పాలన బొంద పెడుదామని మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన చింతమడకలో కూడా కరెంట్ ఇచ్చింది.. గుడి, బడి కట్టింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. డిసెంబర్ 9నాడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడబోతుందని.. ఆడబిడ్డలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో తరలిరావలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.