మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద పార్టీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడతారో, ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియాలని రసమయి అన్నారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారని.. అది ఇక్కడున్న వాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి వెళ్తామో లేదో తెలియని ప్రాంతంగా ఉండేదని.. ఎన్నో ఏళ్లు కళ్లలో నీళ్ళు నములుకుంటూ బతికామని రసమయి తెలిపారు.
Read Also: Minister Malla Reddy: కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నా
కానీ కేటీఆర్ ఆధ్వర్యంలో నేడు సిరిసిల్లకు కొత్త కళ వచ్చిందని రసమయి బాలకిషన్ అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల ప్రజలు మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉండాలని ఆయన అన్నారు. సిరిసిల్ల సిరుల తల్లిగా మారిందని.. ఇక్కడి నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని పేర్కొన్నారు. అటు గ్రామాల్లో ఇక ఏ పార్టీ ఫ్లెక్సీ కనబడ్డా వదలనని.. జిల్లా అధ్యక్షుడు ఆగమన్నా ఇక ఆగేది లేదని రసమయి బాలకిషన్ ఇతర పార్టీల నేతలను హెచ్చరించారు. ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఊరుకునేది లేదన్నారు.