టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందని, కావాలంటే జీవో వచ్చేదాకా సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ సమర్థించుకుంటున్నారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Read Also : Surekha Konidala : సూపర్ స్టైలిష్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “భీమ్లా నాయక్”ను చూసి రివ్యూ షేర్…
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వారే పవన్ తో ‘హరిహరవీరమల్లు’ చిత్రం తీస్తున్న నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్. ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్, దర్శకుడు…
ఈరోజు హైదరాబాద్ లో “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ జరిగింది. అయితే సినిమా చిత్రీకరణ సమయం నుంచి నిన్న మూవీ రిలీజ్ అయ్యే వరకు త్రివిక్రమ్ దర్శకుడు సాగర్ కే చంద్రకు ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్ చైర్ లో కూర్చున్నారని, అంతా ఆయన చేతిలోనే ఉందని రూమర్స్ వచ్చాయి. పైగా త్రివిక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అసలు మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా జరిగిన “భీమ్లా నాయక్”…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంయుక్త మీనన్, నిత్యామీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించగా, తమన్ సంగీతం సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్’కు ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా మేకర్స్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.…
ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘భీమ్లా నాయక్’ మేనియా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్ సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో థియేటర్ లో ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రదర్శితం అవుతుండగా, తమన్ స్టేజి పై ఎక్కి ‘లాలా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీకి మొదటి ఆట నుండే ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ కె చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ ఎ. ఎస్. ప్రకాశ్, చిత్ర నాయిక సంయుక్త మీనన్…
ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లతో థియేటర్లను నిర్వహించలేమంటూ కొంతమంది ఎగ్జిబిటర్స్ వాటిని మూసివేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాను సైతం వారు ప్రదర్శించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే… ఈ విషయంలో గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందనే వాదన వినిపిస్తోంది. ‘అత్యధిక రేట్లకు టిక్కెట్స్ ను అమ్ముకోనిస్తేనే థియేటర్లను నడుపుతాం తప్పితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు నడపమని ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టే దీనిని అర్థం చేసుకోవాలని కొందరంటున్నారు. నిజం చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాను…