పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Read Also : Surekha Konidala : సూపర్ స్టైలిష్ పిక్… చిరు సతీమణి సోషల్ మీడియా ఎంట్రీ
పవన్ గత రాత్రి హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో టీమ్ తో పాటు తన సన్నిహితుల కోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు, ఆయనతో పని చేసిన కొందరు దర్శకులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ రాత్రికి అందరికీ ఆతిథ్యం ఇచ్చారు. “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుండి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ చిత్రానికి రెండో రోజు కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. “భీమ్లా నాయక్” సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించారు. త్వరలో భారీ సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హాజరుకానున్నారు.