Video: రాజస్థాన్‌లో గూడ్స్ రైలు బొలెరో ఎస్‌యూవీని ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ జవాన్ తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్‌లో, సెక్యూరిటీ లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం దారుణంగా దెబ్బతింది. వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Family Dispute: కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య, గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికింది.
Congress: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ నేత షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ని ఉద్దేశిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ఆమె చేసిన ట్వీట్‌ని తొలగించింది. ఫైనల్లో రోహిత్ శర్మ చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. దీని తర్వాత నెటిజన్లు…
Rajasthan: రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా ఇప్పడు అట్టుడుకుతోంది. మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. జిల్లాలోని చిన్న పట్టణం మసుదాలో, పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దోపిడి, మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్రిక్తతల నడుమ మసుదాతో పాటు సమీప ప్రాంతాల్లో మార్కెట్లు మూసేశారు.
Rajasthan : రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఆదివారం నాడు 5 ఏళ్ల బాలుడు 32 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దీని తరువాత పరిపాలన సహాయక చర్యను ప్రారంభించింది.
Rajasthan: రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలో మైనర్ బాలికలను లైంగికంగా వేధించి, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఏడుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన మార్గదర్శకులు కామపిశాచుల్లా తయారవుతున్నారు. క్లాస్ రూముల్లోనే శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ దారుణం రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. కాగా, సదరు బిచ్చగాడి షరీఫ్‌కి కాళ్లు లేకపోవడంతో భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే, అతడు మొత్తం 1.7 లక్షల డబ్బును నగదు రూపంలో చెల్లించి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
Education Minister: కోచింగ్ సెంటర్లకు కేరాఫ్‌గా ఉన్న రాజస్థాన్ కోటా పట్టణంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యలపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు.
స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు... ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది..