Saraswati River: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ ప్రాంతంలో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఏకంగా భూమి నుంచి భారీగా నీరు బయటకు వచ్చింది. ఏకంగా ఈ నీటిలో ఓ జలాశయమే ఏర్పడింది. ఎడారి ప్రాంతంలో భూగర్భం నుంచి ఇంత స్థాయిలో నీరు బయటకు రావడం ఇప్పడు వైరల్‌గా మారింది. పూర్తిగా బంజేరుని తలపించే ప్రాంతంలో, వర్షపాతం అతి తక్కువగా ఉన్న ప్రాంతంలో భూగర్భం నుంచి ఇంత నీరు ఎలా వచ్చిందని అంతా అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే, ఈ నీరు అంతర్వాహిని ‘‘సరస్వతి నది’’ బయటకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సరస్వతీ నది ప్రవహించేది. ప్రస్తుతం నది కనుమరుగై దాని ప్రాంతం ఇసుక ఎడారి ఏర్పడింది. 27 బీడీ సమీపంలో వీహెచ్‌పీ కార్యకర్త విక్రమ్ సింగ్ది తన పొలంలో బోర్ వేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. వేల ఏళ్ల క్రితం రాజస్థాన్ ఎడారి గుండా సరస్వతి నది ప్రవహించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జైసల్మేర్ జిల్లాలో సరస్వతి నదికి సంబంధించిన భారీ రిజర్వాయర్ ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.
రైతు తన పొలంలో బోరు వేస్తుండగా, ఒక్కసారిగా భూగర్భం నుంచి నీరు ఎగిసిపడింది. దీంతో బోరు వేస్తున్న యంత్రాలు కూడా ముగినిపోయినట్లు వైరల్ వీడియో సూచిస్తోంది. భూగర్భ శాస్త్రవేత్త నారారయణ్ దాస్ ఇయాంఖియా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎడారి మట్టి నుంచి ఈ స్థాయిలో నీరు రావడం సాధారణ భూగర్భ జలాల లీకేజీ కాదని ఇనాఖియా అన్నారు. అంతరించిపోయిన సరస్వతి నదీ కాలువతో దీనికి సంబంధం ఉండొచ్చని అనుమానించారు.
Read Also: South Korea: పక్షి ఢీకొనడం, గేర్ ఫెయిల్యూర్, బెల్లీ ల్యాండిగ్.. 179 మందిని బలి తీసుకున్న కారణాలు..
వేదకాలం నాటి సరస్వతి నది:
పురాతన నాగరికతకు కేంద్రంగా ఉన్న సరస్వతి నది ఇప్పటికే థార్ ఎడారి కింద ప్రవహిస్తోందని పలు భౌగోళిక అధ్యయనాలు, రిమోట్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా రుజువైంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నది అంతర్వాహినిగా మారింది. భారతదేశ ప్రాచీన గ్రంథాల్లో కూడా సరస్వతి నదీ ప్రస్తావన ఉంది. రుగ్వేదంలో 80 సార్లు ప్రస్తావించారు. వాతారణ మార్పులు, టెక్టానిక్ ప్లేట్ల కదలిల కారణంగా 5000 ఏళ్ల క్రితం ఈ నది ఎండిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
హిమాలయల్లో ఉద్భవించిన సరస్వతి నీది వేదకాలంలో (8000-5000 BP)లో ఉండేదని, పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుందని చెప్పబడింది. ఈ నది ఒడ్డున హరప్పా నాగరికత ప్రదేశాలు కూడా కనుక్కున్నారు. సరస్వతి నదికి ఉపనదులుగా ఉన్న సట్లేజ్, యమునా నదులు తమ ప్రవాహ దిశలు మార్చుకోవడం కూడా సరస్వతి నదీ అదృశ్యానికి కారణం కావచ్చని అంచనా.
A water stream emerged from the ground during borewell digging on the farm of VHP worker Shri Vikram Singh in Jaisalmer, Rajasthan.
Jaisalmer desert is said to align with the 'Ancient' flow path of the extinct 'Maa Saraswati River'. pic.twitter.com/mBedx4K51V
— Anshu Kushwaha (@Anshu_840) December 28, 2024