Beggar Buys iPhone: ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది కలలుకంటున్నప్పటికీ.. అధిక ధర ఉండటంతో EMIలో లేదా నెలల తరబడి డబ్బులు ఆదా చేసిన తర్వాత కొంటారు. కానీ, ఓ బిచ్చగాడు పూర్తి మొత్తంలో నగదు రూపంలో డబ్బులు చెల్లించి ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. కాగా, సదరు బిచ్చగాడి షరీఫ్‌కి కాళ్లు లేకపోవడంతో భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే, అతడు మొత్తం 1.7 లక్షల డబ్బును నగదు రూపంలో చెల్లించి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
Read Also: Akkineni Akhil : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్!
ఇక, శారీరకంగా వికలాంగుడైన షేక్ షరీఫ్ అనే బిచ్చగాడు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ కొనుగోలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై పైసా కహాన్ సే ఆయా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో యూజర్ ఇలా రాసుకొచ్చాడు.. భిక్షాటన చేయడం ఉత్తమ వ్యాపారం, పెట్టుబడి లేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కఠినమైన ఉండదు, ఎలాంటి ఒత్తిడి లేదు అంటూ పేర్కొన్నాడు.
A video of a beggar carrying an iPhone 16 Pro Max in Ajmer, Rajasthan has surfaced on the internet.
The alms seeker's response to a particular question has amused netizens. pic.twitter.com/buFnD0ZoGE
— The Siasat Daily (@TheSiasatDaily) January 19, 2025