Sakshi Gupta: ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్.. రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
- ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్
- రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది సినిమాల్లో మాదిరిగా.. నిజ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయని ఊహించుకుంటారు. కానీ అంతా అయ్యాకగాని తత్వం బోధపడదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఆ మధ్య టాలీవుడ్‌లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో మాదిరిగా బ్యాంక్‌ను మోసం చేయాలని ఓ ఉద్యోగి ప్లాన్ చేసింది. కానీ సినిమాల్లో మాదిరిగా నిజజీవితంలో తప్పించుకోవడం సాధ్యం కాదని తెలియక కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. హాజరైన సీఎం స్టాలిన్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
రాజస్థాన్‌లోని కోటాలో ఐసీఐసీఐ రిలేషన్‌షిప్ మేనేజర్ సాక్షి గుప్తా 41 మంది కస్టమర్లకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. 2020 నుంచి 2023 సంవత్సరాల మధ్య 110 ఖాతాల నుంచి రూ.4.58 కోట్లు లాక్కుంది. కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నెంబర్లను మార్చి తన కుటుంబ సభ్యుల నెంబర్లను అప్‌డేట్ చేసింది. దీంతో ఓటీపీలు, మెసేజ్‌లు కస్టమర్లకు చేరకపోవడంతో ఎలాంటి అనుమానాలు రాలేదు. అయితే కస్టమర్ల నుంచి దొంగిలించిన డబ్బుంతా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. తీరా చూస్తే ఆ డబ్బుంతా పోగొట్టుకుంది. తీసుకున్న డబ్బును మాత్రం ఆమె తిరిగి డిపాజిట్ చేయలేకపోయింది. కస్టమర్లు డిపాజిట్లు చెక్ చేసుకోగా డబ్బులు లేకపోవడం లబోదిబో అన్నారు. దీంతో బండారం బయటపడి పోలీసులకు చేరింది. అయితే సినిమాలో హీరో తప్పించుకున్నట్టుగా సాధ్యం కాకపోవడంతో మేనేజర్ సాక్షి గుప్తా అండగా బుక్కైంది.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
ఒక కస్టమర్ ఆరా తీయడంతో ఈ యవ్వారం బయటపడింది. ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు అందగా అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతోంది. గురువారం సోదరి వివాహం జరుగుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి గుప్తాను అరెస్ట్ చేశారు. కస్టమర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకుల్లో కూడా క్షేమం కాకపోతే.. ఇంకెక్కడ దాచుకోవాలని కస్టమర్లు వాపోతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..