రాజస్థాన్‌లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్‌పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె తన భర్తను వదిలేసి స్నేహితురాలి వద్దకు వెళ్లడం గమనార్హం.
READ MORE: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి.. కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి(వీడియో)
ఝుంఝునులోని మెయిన్‌పురా గ్రామానికి చెందిన రేణు(25), అంజు(23)లు 7-8 నెలల క్రితం బంధువుల వివాహంలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు స్నేహితులయ్యారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంజు వివరన ప్రకారం.. వారిద్దరూ ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నారు. అనంతరం వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేణు 5వ తరగతి, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది. ఇందులో రేణుకు 5 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కానీ ఆమె తన భర్తను, తల్లిదండ్రులను వదిలేసి మరీ అంజుతో పారిపోయింది.
అయితే.. రేణు కుటుంబీకులు 10 రోజుల క్రితం గోత్రా పోలీస్ స్టేషన్‌లో తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అంజుతో కలిసి పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని కనుగొన్న పోలీసులు.. ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నారని చెప్పడంతో ఏం చేయలేక పోయారు. ఈ అంశంపై గుధాగౌర్జీ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిషన్ మాట్లాడుతూ.. “జూన్ 4న రేణు అత్తమామలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు అంజు ఇంటికి చేరుకున్నారు. కానీ రేణు తన అత్తమామల ఇంటికి లేదా ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. ఇద్దరు అమ్మాయిలు మేజర్‌లు. ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటున్నారు. చట్టం ఇందులో జోక్యం చేసుకోదు.” అని స్పష్టం చేశారు. రేణు 5వ తరగతి వరకు చదువుకుంది, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది.