Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్యకు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ, ఆంధ్రా, తెలంగాణలను తన రెండో సొంత ఇల్లుగా మార్చుకున్న సూర్య, తాజాగా మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు మేకర్స్. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సరికొత్త రికార్డు సృష్టించి ఇటీవల వచ్చిన విజయ్ జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టింది. ‘జననాయగన్’ ₹1.72 కోట్లు ఓపెనింగ్ డే ప్రీ-సేల్స్ రికార్డును ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అధిగమించింది. దీనితో ఈ ఏడాది అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన నంబర్ 1 డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. తెలుగు వెర్షన్ డ్వాన్స్‌లు రూ. 1.82 కోట్ల మార్కును అధిగమించాయి. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచీ వైవిధ్యమైన సినిమాలను, నటనను ఆదరించడంలో ముందుంటారు. సూర్య మార్కెట్ మరియు క్రేజ్ పరంగా తెలుగు రాష్ట్రాలు నిజంగానే ఆయనకు రెండో సొంత గడ్డలా మారిపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదైన అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 7 కోట్ల మార్కును అందుకుంది. వరుస రికార్డులతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!