Pakistani Spy: భారతదేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని దాయాది పాకిస్తాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. తాజాగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్‌లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని డీగ్ ప్రాంతానికి చెందిన ఖాసిం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Read Also: Astrology: మే 25, ఆదివారం దినఫలాలు
అయితే, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఖాసీం పాకిస్తాన్ లోని కొంత మందితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దేశంలో కూడా అతడు పర్యటించినట్లు సమాచారం. నిందితుడికి సంబంధించిన ఫోన్‌ను ఫోరెన్సిక్ టెస్టు కోసం పంపించి.. విచారణ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటి వరకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.