Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran: మలయాళ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయంపై తొలిసారి స్పందించారు. ఇటీవల ఆమె ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన తన రిలేషన్షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ఆ రిలేషన్షిప్ కారణంగా తన మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాయన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు తన వృత్తిపరమైన ప్రయాణంపైనా కూడా ఆ ప్రభావం పడిందని ఆమె పేర్కొన్నారు. తాను ఇష్టపడే పనిపై దృష్టి పెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించిందని చెప్పారు.
తన రిలేషన్షిప్ కొనసాగుతున్న టైంలో, భవిష్యత్తులో వివాహం చేసుకుంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆమె ఆలోచించారట. అదే సమయంలో తనకు ఎదురవుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని, ఆ బంధం నుంచి బయటకు రావడమే సరైన నిర్ణయమని భావించినట్లు తెలిపారు. దీంతో తన జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకుని ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త దశను ప్రారంభించినట్లు అనుపమ చెప్పుకొచ్చారు. గత అనుభవాల నుంచి బయటపడుతూ తనను తాను తిరిగి నిర్మించుకోవడం, మానసిక ప్రశాంతతను పొందడం, కెరీర్‌పై దృష్టి పెట్టడమే తన ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. అయితే అనుపమ తన ఎక్స్ లవర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతున్న అనుపమకు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!