Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- బంగ్లాదేశ్‌లో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం..
- గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 8–16 గంటల వరకు విద్యుత్ కోతలు.
- హార్ముజ్ సంక్షోభం, గ్యాస్ కొరతలో బంగ్లాదేశ్‌లో చీకట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా 10-16 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా దేశవ్యాప్తంగా దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమలు చేస్తోంది. విద్యుత్ కొరత కారణంగా ఇకపై బంగ్లాదేశ్‌లోని దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దేశంలోని అన్ని బిల్ బోర్డులను సాయంత్రం 7 గంటల లోపు ఆపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని డెకరేషన్ లైట్లు కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పింది. బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ బుధవారం సాయంత్రం జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఈ నిర్ణయాలను ప్రకటించింది.
విద్యుత్ కొరత ఎందుకు?
బంగ్లాదేశ్‌కు వచ్చే ఇంధనం దాదాపుగా గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి మూతపడింది. బంగ్లాదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి గ్యాస్‌పై ఆధారపడి ఉంది. గ్యాస్ కొరత కారణంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ గతంలో 5000 మెట్రిక్ టన్నుల డీజిల్ పంపింది. కొన్నాళ్ల పాటు ఈ సాయంతో నెట్టుకొచ్చింది. 33092 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధన కొరత కారణంగా అందులో సగభాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
భారత సాయం కోసం బంగ్లా చూపు..
సంక్షోభాన్ని అధిగమించడానికి బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. గత వారం గత వారం భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదితో బంగ్లాదేశ్ ఇంధన మంత్రి ఇక్బాల్ హసన్ మహ్మూద్ సమావేశమైన సందర్భంగా ఈ అభ్యర్థన చేశారు.భారత్ నుంచి డీజిల్ సరఫరా కోసం ఇప్పటికే పైప్‌లైన్ ఉందని, దాని ద్వారా మరింత డీజిల్ అందించాలని మంత్రి కోరారు.
ఇండియా–బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ 2017లో షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైంది. బంగ్లాదేశ్ ఇంధన భద్రతలో ఈ పైప్‌లైన్ కీలక పాత్ర పోషిస్తోంది. 15 ఏళ్ల ఒప్పందం ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం 1,80,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఢాకాకు పంపాల్సి ఉంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం సమయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్ ఇప్పటికే 30,000 టన్నులకు పైగా డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు పంపింది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!