Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం, అత్యంత సన్నని డిజైన్‌తో భారత మార్కెట్లో రూ.1,09,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి ఈ ఫోన్ రూ. 59,999 లకే లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.76,999గా ఉంది, అయితే బ్యాంక్ ఆఫర్లతో లాంచ్ ధర కంటే దాదాపు రూ.37,000 తక్కువకే దీనిని సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 5.8mm అత్యంత సన్నని డిజైన్, 163 గ్రాముల తేలికైన బరువు. ఇందులో టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో కూడిన 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X LTPO డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అద్భుతమైన పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మల్టీటాస్కింగ్, గేమింగ్, AI ఫీచర్లకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. కెమెరా విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అయితే, స్లిమ్ డిజైన్ కారణంగా ఇందులో 3,900mAh బ్యాటరీని మాత్రమే అందించారు, ఇది 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కొనుగోలు చేసే ముందు లైవ్ ధరలు, స్టాక్‌ను తనిఖీ చేయడం మంచిది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..