Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని నాగౌర్లో రోడ్షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన ప్రచార వాహనానికి విద్యుత్ తీగలు తగిలాయి.
4 dead and several injured in Rajasthan Bus Accident: రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ (రైలు పట్టాలు)పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు…
ఇటీవల రాజస్థాన్ లోని అల్వార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ ఎన్ని మసీదులు, గురుద్వారాలు నిర్మించారో చూడండి, ఇది భవిష్యత్తులో మనకు పుండుగా మారుతుంది.. అందుకే ఈ పుండును నిర్మూలించడం మా కర్తవ్యం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
Rajastan: రాజస్థాన్లో ఈడీ మరోసారి రంగంలోకి దిగింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణం కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం రాజస్థాన్లోని 25 చోట్ల ఈడీ బృందం దాడులు చేసింది.
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడవు ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల్ని పాత కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లా దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. రాబోయే రాజస్థాన్ ఎన్నికల కోసం సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్లో జీవిత భాగస్వామి వివరాలను కోరుతున్న కాలమ్లో కాంగ్రెస్ నాయకుడు "విడాకులు తీసుకున్నాను" అని పేర్కొన్నందున ఇది వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి.
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ను టార్గెట్ చేశారు.