Congress released its manifesto for the Rajasthan assembly elections 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మంగళవారం ఉదయం విడుదల చేసింది. జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా, సీఎం అశోక్ గహ్లోత్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా,…
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తన తండ్రి రాజీవ్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ పేరును తప్పుగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వెంటనే కాంగ్రెస్ నాయకుడిపై విరుచుకుపడడంతో పాటు ఎగతాళి చేసింది.
Congress: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ప్రధానిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విధంగా దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి.
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీ కోసం వీఐపీ డ్యూటీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రోజున చురు జిల్లాలోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోటా పోలీస్ పోస్ట్ ఏరియాలో పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా ఝంజులో జరిగే ప్రధాన మంత్రి ర్యాలీ కోసం డ్యూటీ చేసేందుకు వెళ్తున్నారు.
BJP: ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ సారి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని దింపేయాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ ఓటర్ల సెంటిమెంట్ రిపీట్ చేస్తారని బీజేపీ భావిస్తోంది. రాజస్థాన్ లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఇది తమకు కలిసి వస్తోందని బీజేపీ అనుకుంటోంది.
Rajasthan Assembly Polls: రాజస్థాన్‌లో ఓటు వేయడానికి కేవలం 10 రోజుల ముందు కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ మరణించారు. ఆయనకు 75 ఏళ్లు. కూన్ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
Ashok Gehlot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్జీ కన్హయ్య లాల్ హత్య కేసును బీజేపీ పెద్ద చర్చనీయాంశం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయంపై పెద్ద వాదన చేశారు. కన్హయ్య లాలా హంతకులకు బీజేపీతో సంబంధాలున్నాయన్నారు.